Home వార్తలు కేసీఆర్‌కు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాలాభిషేకం – VRM MEDIA

కేసీఆర్‌కు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాలాభిషేకం – VRM MEDIA

by VRM Media
0 comments
కేసీఆర్‌కు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాలాభిషేకం



తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..? రాజకీయం అంతా కేసీఆర్ చుట్టూనే తిరుగుతోంది. కేసీఆర్‌తో ఏపీకి ఏం సంబంధం అని అంటారా? చంద్రబాబు అంటే ఏపీనే కదా.. అందుకే ఆ మాట అనాల్సి వచ్చింది. అలా ఎందుకు? అంటే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ కేసీఆర్ కేంద్రంగానే సాగడమే అందుకు కారణం. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి వద్దాం. ఫస్ట్.. కేసీఆర్ తుంటి ఎముక విరగగానే, ఆయనకు బద్ధ శత్రువులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడే ముందుగా వెళ్లి పరామర్శించారు. మేము గెలిచాం, నువ్వు పడ్డావ్.. అని వీరిద్దరు ఆయనను దెప్పి పొడవడానికే అని రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవాళ్లు కూడా అనుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పాలనపై దునుమాడుతూ వచ్చారు. సందు దొరికినప్పుడల్లా కేసీఆర్ పాలనపై దుమ్మెత్తిపోశారు. కేసీఆర్‌కు ఓటు వేయని వాళ్లంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టు అని చూపించడానికి రేవంత్ శతవిధాల ప్రయత్నించారు. అయితే, కరువు తాండవించి ఆయన ప్లాన్ పటాపంచలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కేసీఆర్ కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్టు చేయడం, పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కారు పార్టీ రేసులో లేకుండా పోయి పార్లమెంట్ ఎన్నికల్లో ‘సున్నా’కే పరిమితమైంది.అదే సమయంలో.. జగన్ ఓడిపోవడం, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో పరిస్థితులు మరింత రంజుగా మారాయి. మళ్లీ జగనే వచ్చి ఉంటే ఏపీ..ఏపీలాగే, తెలంగాణ.. తెలంగాణలాగే కొనసాగేది. చంద్రబాబు రావడంతో తెలంగాణ పరిస్థితిలో మార్పు మొదలైంది. ఏపీలో రిజల్ట్స్ రాకముందే, తెలంగాణలోనూ పార్టీని విస్తరిస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం.. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం వరకు అంతా కామనే. కానీ, చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తారట..

2,808 Views

You may also like

Leave a Comment