Home వార్తలు బీఆర్ఎస్ పోస్టుమార్టం పార్టు-2 : కేసీఆర్ మాటల్లో.. జగన్ మాటల్లో అదే తేడా..! – VRM MEDIA

బీఆర్ఎస్ పోస్టుమార్టం పార్టు-2 : కేసీఆర్ మాటల్లో.. జగన్ మాటల్లో అదే తేడా..! – VRM MEDIA

by VRM Media
0 comments
బీఆర్ఎస్ పోస్టుమార్టం పార్టు-2 : కేసీఆర్ మాటల్లో.. జగన్ మాటల్లో అదే తేడా..!



తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.. తెలంగాణ సాధించిన నేత.. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన నాయకుడు.. ఇలా చెప్పుకుంటూపోతే కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణపరంగా పొగడ్తలు కేసీఆర్‌కు దక్కాల్సినవేనన్న మాటకూ తెలంగాణ సమాజం ఓకే చెప్తుంది. కానీ, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయలేదు? కేసీఆర్‌ను పొడిగిన నోళ్లే.. తమ చేతి వేళ్లతో వేరే పార్టీ గుర్తుకు ఎందుకు ఓటేశారు? కేసీఆర్ అంటే కోపమా? అసహ్యమా? ద్వేషమా? ఈ ప్రశ్నలకు… కాదు. కేసీఆరే ఉండాలి అనుకొని కూడా వేరే పార్టీకి ఓటేసినవాళ్లెందరో. అందులో కేసీఆర్ అభిమానులు, కేసీఆర్ మద్దతుదారులు, కేసీఆర్ అనునూయులూ ఉన్నారు. మరి ఓటు ‘చేతి’ గుర్తుకు ఎందుకు మారింది?నోరు మంచిదైతే ఊరు మంచిదైతది.. అన్న సామెతను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఈ మాట కొందరు బీఆర్ఎస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు నొప్పించి ఉండొచ్చు. కేసీఆర్ అంటే కోసుకునేవాళ్లకు కోపం తెప్పించి ఉండొచ్చు. కానీ, వీళ్ల నొప్పి కంటే.. తెలంగాణ ప్రజల గుండెల్లో నొప్పి ఇంకా ఎక్కువ. ఎందుకు అంటే.. కేసీఆర్ వ్యాఖ్యలే తెలంగాణ ప్రజలను నొప్పించిందన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయా సభల్లో మాట్లాడిన కేసీఆర్.. ”మీ జీవితాలు బాగుండాలంటే నాకే ఓటేయాలి. నాకు ఓటేయకపోతే, ఇంటికి పోయి పడుకుంటా. నాకేం పోయేది లేదు” అని చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచించేలా చేశాయి. గెలిచినప్పుడు అధికారాన్ని అనుభవించి, ఓడిపోయాక ఇంటికి వెళ్లి పడుకుంటాడా.. అని తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించారు. దానికి దక్కిన ప్రతిఫలమే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాతైనా.. ఆ వ్యాఖ్యలను సమీక్షిస్తే బాగుండేది. కానీ, అలా జరగలేదు.బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి కేసీఆర్ సంజాయిషీ ఇచ్చుకోలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. కానీ, ప్రజలు కోరుకున్నది కేసీఆర్ మాట్లాడాలని. ఎందుకంటే తెలంగాణ పెద్దగా కేసీఆర్‌ను వాళ్లు

2,812 Views

You may also like

Leave a Comment