Home వార్తలు ఎందుకూ పనికిరాని ఐక్యరాజ్యసమితి.. భారత్ లాంటి దేశాలపైనే దీని ఏడుపంతా.. ఇంకా అవసరమా? – VRM MEDIA

ఎందుకూ పనికిరాని ఐక్యరాజ్యసమితి.. భారత్ లాంటి దేశాలపైనే దీని ఏడుపంతా.. ఇంకా అవసరమా? – VRM MEDIA

by VRM Media
0 comments
ఎందుకూ పనికిరాని ఐక్యరాజ్యసమితి.. భారత్ లాంటి దేశాలపైనే దీని ఏడుపంతా.. ఇంకా అవసరమా?



||ప్రతీకాత్మక చిత్రం||రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో ఐక్యరాజ్యసమితి ప్రభావవంతంగా పనిచేసిందా? లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్-పాలస్తీనా(హమాస్) మధ్య యుద్ధాన్ని ఆపుతుందా? లేదు. అలాంటప్పుడు ఈ ఐక్యరాజ్యసమితి ఎందుకు? అంటే.. ఎందుకూ పనికిరాదంటున్నారు నిపుణులు. ఐక్యరాజ్యసమితిని ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టాలో అమెరికా, బ్రిటన్, రష్యా కలిపి ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 1945 ఏప్రిల్ 25 – జూన్ 26 మధ్య జరిగిన సమావేశంలో 51 దేశాలు చార్టర్‌పై సంతకాలు చేశాయి. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్‌లో లాంఛనంగా జరిగింది.దీని ఆశయాలు.. యుద్ధాలు జరగకుండా చూడడం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను దేశాలు గౌరవించేలా చేయడం, సామాజిక అభివృద్ధి సాధించడం, మానవ జీవితాలను సుఖవంతం చేయడం. కానీ, వీటిలో వేటినీ సక్రమంగా నిర్వహించినట్లు ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే లేవు.ముఖ్యవిషయం విలువైన.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా శాశ్వత సభ్య దేశాలు. ఈ దేశాల్లో అన్నీ ఏదో ఒక యుద్ధంలో పాల్గొన్నవే/యుద్ధంలో ఉన్న దేశాలకు మద్దతు ఇచ్చినవే. పెద్ద అమెరికాన్నలా వ్యవహరిస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా, ఉక్రెయిన్ మద్దతు ఇచ్చింది. బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తుంది. ఇక రష్యా నేరుగా యుద్ధంలో పాల్గొన్నారు. ఎలాగూ రష్యా, చైనా స్నేహితులే కాబట్టి.. చైనా కూడా రష్యా వైపే ఉంది. అంటే.. ప్రపంచ శాంతి నెలకొల్పాల్సిన దేశాలే యుద్ధాన్ని ప్రేరేపిస్తే, ఈ ఐక్యరాజ్యసమితి ఎందుకు ఉంటుంది? అని అంతర్జాతీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ సైన్యాలకు మధ్య యుద్ధం జరుగుతుంది, ఒక విధంగా ఇది ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధమే. దీన్ని ఆపడానికి ఏ దేశమూ ప్రయత్నించటం లేదు. వేల మంది సాధారణ ప్రజలు చనిపోతున్నా, హింసను ఆపాలని కోరుతున్న దేశం ఒక్కటీ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో

2,816 Views

You may also like

Leave a Comment