
ఒంటిమిట్ట మండలంలో అప్రమత్త చర్యలు
గ్రామగ్రామాన పర్యటించిన ఎంపీడీవో సుజాత
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 30
ఒంటిమిట్ట.గంగల చెరువు వద్ద బండ్ పరిశీలన
ప్రజలకు ముందస్తు భరోసా
ఒంటిమిట్ట నవంబర్ 30: దిత్వా తుఫాను ముప్పు మంటలా మండుతున్న వేళ… ప్రభుత్వం కదిలింది – అధికారులు స్పందించారు . ఒంటిమిట్ట మండల పరిధిలో వాతావరణ మార్పులు, బలమైన గాలులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఎంపీడీవో సుజాత ఆధ్వర్యంలో విస్తృత స్థాయి అప్రమత్త పర్యటన జరిగింది. నరసన్నగారి పల్లి, పెన్నా పేరూరు, గంగ పేరూరు, చిన్న కొత్తపల్లి, రాచగుడిపల్లి గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పర్యటనలో
ఈ ఓ పి ఆర్ డి శ్రీలత, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి, చెరువు చైర్మన్ కే. వెంకటరమణ, టిడిపి సీనియర్ నాయకులు కే. బొబ్బిలి రాయుడు, క్లస్టర్ కో–కన్వీనర్ కే. సుబ్బరాయుడు, పి. వెంకటేశు, పి. శ్రీనివాసులు, ఎస్. కొండయ్య తదితరులు పాల్గొని అధికార యంత్రాంగానికి తోడ్పడ్డారు.
గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి – భయపడొద్దు… జాగ్రత్తపడండి”
గ్రామస్తుల మధ్యకు వెళ్లి మాట్లాడిన ఎంపీడీవో సుజాత, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీ వెంటే ఉంది. కానీ జాగ్రత్త తప్పనిసరి” అని అన్నారు.
లోతట్టు ప్రాంతాలు, బలహీన ఇళ్లు, వర్షపు నీరు నిలిచే చోట్లను గుర్తించి, అవసరమైన చోట ముందస్తుగా ఖాళీ చేయాలని, కొన్ని గృహాలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సూచనలు చేశారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేని ప్రాంతాల్లో తక్షణమే చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను నోటు చేసుకుని, గ్రామ సచివాలయాల ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
చిన్న కొత్తపల్లి వద్ద గంగల చెరువు – కీలక పరిశీలన
పర్యటనలో చిన్న కొత్తపల్లి సమీపంలోని గంగల చెరువు ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.నీటి మట్టం, గట్టు బలం, బండ్‌పై ఏర్పడిన ప్రవాహాన్ని అధికారులు పరిశీలించారు.
“కలిసివచ్చిన వర్షం వరమైతే…అదుపు తప్పితే ముప్పే” అని స్పష్టం చేశారు.
బండ్‌పై ఎలాంటి బలహీనత కనిపించినా వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని చెరువు చైర్మన్ కే. వెంకటరమణకు సూచించారు.
చలి గాలుల ముప్పుమరో ప్రమాదం
తుఫాను కారణంగా మాత్రమే కాకుండా…
తీవ్ర చలి గాలుల వల్ల సైతం ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఎంపీడీవో హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన ముఖ్య సూచనలు:
ఉదయం, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు రావద్దు
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు తప్పనిసరిగా గోరువెచ్చని దుస్తులు ధరించాలి
వేడి నీరు, గోరువెచ్చని ఆహారం తీసుకోవాలి
జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలి
చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడరాదు
పశువులను చలి గాలుల నుంచి రక్షించేలా గదుల్లో ఉంచాలి
“తుఫాను కంటే… ఆ తర్వాత వచ్చే చలి ఇంకా ప్రమాదకరం” అని ఆమె హెచ్చరిక జారీ చేశారు.
ప్రజలే ప్రథమ ప్రాధాన్యం – అధికారులు స్పష్టం
గ్రామస్తుల విన్నపాలను విన్న అనంతరం ఎంపీడీవో సుజాత మాట్లాడుతూ – “ప్రజల భద్రతకన్నా మాకు పెద్ద పని లేదని అన్నారు”
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల వివరాలను అందజేశారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మండలాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు స్పష్టం చేశారు. “విపత్తు వచ్చిన తర్వాత కాదు…
ముందే మేల్కొన్న పాలన – అదే నిజమైన పాలన”
దిత్వా ముప్పు వేళ ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఈ ముందస్తు చర్యలు ప్రజల్లో ధైర్యం నింపాయి.