Home వార్తలు మ‌న ఫోన్‌, ల్యాప్‌టాప్‌లో చైల్డ్ పోర్న్‌ చూస్తే పోలీసులు క‌నిపెడతారా? ఎలా? – VRM MEDIA

మ‌న ఫోన్‌, ల్యాప్‌టాప్‌లో చైల్డ్ పోర్న్‌ చూస్తే పోలీసులు క‌నిపెడతారా? ఎలా? – VRM MEDIA

by VRM Media
0 comments
మ‌న ఫోన్‌, ల్యాప్‌టాప్‌లో చైల్డ్ పోర్న్‌ చూస్తే పోలీసులు క‌నిపెడతారా? ఎలా?


ఈవార్త‌లు, హైద‌రాబాద్: చేతిలో మొబైల్ ఫోన్‌ ఆగండాగండి.. ఒక వేళ ఫోన్‌లో ఆ వీడియోలు ఓపెన్ చేస్తే మీరు క‌ట‌క‌టాల్లోకి వెళ్లిపోతారు. ఏంటి మా గ్యాడ్జెట్‌లో గుట్టుగా పోర్న్‌ చూస్తే పోలీసులకు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? అనేగా మీ అనుమానం. మీరు గుట్టుగా చూసినా.. గుట్టుచప్పుడు కాకుండా గదిలో ఓ మూల కూర్చొని చూసినా.. వీడియోలు డౌన్‌లోడ్ చేసినా.. వాటిని వేరేవాళ్లకు పంపినా టెక్నాలజీ సాయంతో పోలీసులు ఇట్టే పట్టేసుకుంటున్నారు. అనంత‌రం పోక్సో కేసు న‌మోదు చేసి, జైలుకు పంపుతున్నారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఈ ఏడాది ఆగ‌స్టు వ‌ర‌కు 500 మంది ఈ త‌ర‌హా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో ఎక్కువ మందిపై పోర్న్ ప్ర‌భావం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

అమెరికా నుంచి మ‌న ఐపీ అడ్ర‌స్‌లు పోలీసుల‌కు..

చిన్నారులతో షూట్ చేసిన పోర్న్ వీడియోలు చూసినా.. డౌన్‌లోడ్ చేసినా.. వారిని ఎవ‌రికైనా పంపినా శిక్షార్హులేన ని ఇటీవ‌ల సుప్రీంకోర్టు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీంతో హైద‌రాబాద్ పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. చైల్డ్ పోర్న్ వీడియోలను వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ద్వారా షేర్చేస్తన్నవారిపై నిఘా పెట్టారు. ఇక్కడి పోలీసులతోపాటు విదేశాల్లోని నిఘా సంస్థలు కూడా వీటిపై దృష్టిపెట్టాయి. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ ఎస్ ఐ), నేషనల్ సెంటర్ ఫార్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చైల్డ్రన్స్ (ఎన్‌సీఎంఈసీ) లాంటి సంస్థలు ఇండియాలో పోర్స్ చూసేవారి గ్యాడ్‌జెస్ ఐపీ అడ్రస్‌లను సేకరించి, కేంద్ర హోంశాఖకు అందజేస్తోంది. అలావచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో ఐటీవ’ల ఓ యువకుడిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఇక్క‌డి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుట్టుగా చైల్డ్ పోర్న్ వీక్షించే వారిని ఐపీ అడ్రస్‌ల ఆధారంగా గుర్తిస్తున్నారు. వారిపై పోక్సో కింద కేసు నమోదైంది. చైల్డ్ పోర్న్ చూసినా.. షేర్ చేసినా పోక్సోతోపాటు ఐటీ చట్టం కింద కేసులు పెడుతున్నారు. ఈ కేసుల్లో ఐదేండ్ల జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

రికార్డులే చిన్నబోగా..! కోహ్లీ సంచలనాల మోత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,807 Views

You may also like

Leave a Comment