Home వార్తలు భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయా.. కేంద్రానికి మెటా హెచ్చరిక – VRM MEDIA

భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయా.. కేంద్రానికి మెటా హెచ్చరిక – VRM MEDIA

by VRM Media
0 comments
భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయా.. కేంద్రానికి మెటా హెచ్చరిక



భారతదేశంలో వాట్సాప్ నిషేధం | భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయా? కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలే దీనికి కారణమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చాటింగ్, కాల్స్, వీడియోలు, డాక్యుమెంట్లు, ఫైల్‌లు వంటి వాటిని గోప్యంగా ఉంచే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసేయాలని ఒత్తిడి చేస్తే భారత్‌లో తమ సేవలను నిలిపివేస్తామని వాట్సాప్ హెచ్చరించింది. కేంద్రం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్-2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్ట్‌ లేదా మెసేజ్‌ మొదట ఎవరి వద్ద నుంచి వచ్చింది? దాని సృష్టికర్త ఎవరు? అనేది సోషల్ మీడియా సంస్థలు గుర్తించాలి. అలా చేయాలంటే కోట్ల మెసేజ్‌లను ఏళ్ల తరబడి స్టోర్‌ చేయవలసి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిబంధనలు లేవు మెటా తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పైగా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ విధానానికి విఘాతం కలుగుతుందని వివరించారు. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ వల్ల చాటింగ్, సమాచారం, ఫైల్స్‌లో రహస్యంగా నమ్మకంతోనే భారత్‌లో కోట్ల మంది వినియోగదారులు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారని, దీనికి భంగం కలిగిస్తే తమపై నమ్మకం దెబ్బతింటుందని కోర్టుకు తెలిపింది. కాదు అంటే వాట్సాప్‌ భారత్‌ను వదిలి వెళ్తుంది. 4(2) నిబంధన వ్యక్తుల గోప్యతకు వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. 2021 ఫిబ్రవరిలో కేంద్రం ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించాలని సూచించింది. దీనితో ఆ నిబంధనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

2,807 Views

You may also like

Leave a Comment