
||చంద్రయాన్-3 ఫోటో: ఇస్రో||చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్-3 విక్రమ్ లియాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కోవటం కష్టమే. ఇస్రో కూడా దానిపై ఆశలు వదులుకున్నట్లే. ల్యాండర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు రాకపోవడమే దీనికి కారణం. చంద్రుడిపై సెప్టెంబర్ 22న సూర్యోదయం అయ్యింది. అప్పటి నుంచి విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌ను తిరిగి క్రియాశీలకంగా చేసేందుకు ఇస్రో శతవిధాల ప్రయత్నిస్తోంది. అయినా, ప్రయత్నం సఫలం కాలేదు. తాజాగా, తాజాగా చంద్రయాన్-3తో సంబంధం ఉన్న ఇస్రో మాజీ చైర్మన్, స్పేస్ కమీషన్ మెంబర్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రోవర్, లియాండర్ యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని అన్నారు. ఆశ కోల్పోతున్నామని చెప్పారు. అవకాశం ఉండి ఉంటే ఈ పాటికే అవి నిద్రాణ స్థితి నుంచి బయటికి వచ్చేవని స్పష్టం చేశారు.