Home ఎంటర్‌టెయిన్మెంట్ విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..! – VRM MEDIA

విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..! – VRM MEDIA

by VRM Media
0 comments
విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..!



మరికొద్ది గంటల్లో అఖండ తాండవం
పార్ట్-3 టైటిల్ లీక్!

అఖండ తాండవానికి సమయం ఆసన్నమైంది. రేపు(డిసెంబర్ 4) రాత్రి ప్రీమియర్ షోలతో ‘అఖండ-2’ ప్రభంజనం మొదలుకానుంది. ఈ పార్ట్-3 టైటిల్ కి సంబంధించిన చర్చ ఆసక్తికరంగా మారింది. (అఖండ 2 తాండవం)

సింహా, లెజెండ్ తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘అఖండ’. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘అఖండ 2: తాండవం’ వస్తోంది. డిసెంబర్ 5 విడుదల తేదీ కాగా, డిసెంబర్ 4 రాత్రి నుండే ప్రీమియర్స్ పడనున్నాయి.

‘అఖండ-2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

‘అఖండ’ యూనివర్స్ నుండి మూడో భాగం కూడా రానుందని. అంతేకాదు, ఈ పార్ట్-3 కి ‘జై అఖండ’ అనే టైటిల్ ఫిక్స్ అనిపిస్తోంది.

“థియేటర్లలో శివ తాండవం చూడటానికి సిద్ధంగా ఉండండి” అంటూ తాజాగా సంగీత దర్శకుడు తమన్.. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాటు, టీమ్‌తో దిగిన సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

తమన్ షేర్ చేసిన ఫోటోలలో స్క్రీన్ మీద ‘జై అఖండ’ అని పేరు పెట్టారు. దీంతో పార్ట్-3 టైటిల్ అదే అయ్యుంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి నిజంగానే అఖండ-3 ఉందా? టైటిల్ ‘జై అఖండ’నా కాదా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

2,844 Views

You may also like

Leave a Comment