Home ఆంధ్రప్రదేశ్ నా తండ్రి చదువుతోపాటు సంస్కారం నేర్పించిన ఘనత ఆయనదే

నా తండ్రి చదువుతోపాటు సంస్కారం నేర్పించిన ఘనత ఆయనదే

by VRM Media
0 comments

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

ప్రత్తిపాడు VRM MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్ 4:–

నా తండ్రి ముద్రగడ పద్మనాభం చదువుతోపాటు సంస్కారం నేర్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని రాజకీయాల్లో ఎలా ఉండాలో నా తండ్రిని చూసి నేర్చుకున్నానని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. తన నివాసంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితులై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాకు నాలుగు పేజీల లేఖ రూపంలో ఏడాది కాలంలో తన రాజకీయ ప్రస్థానంపై కొన్ని విషయాలు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లామని గ్రామాల్లో అన్ని విభాగాల నుండి పూర్తిస్థాయిలో కమిటీలు వేసామని నియోజకవర్గంలో వైసిపి పార్టీ ఆదరణ ఎక్కడ కోల్పోకుండా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు సహకరించి నా రాజకీయ ప్రస్థానంలో అన్ని విధాలుగా సహకరించారన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నేను పర్యటించినప్పుడు కొన్ని దశాబ్దాలు కాలం నుండి నియోజకవర్గానికి మా తాత ముద్రగడ వీర్రాఘవరావు, నా తండ్రి ముద్రగడ పద్మనాభం నియోజకవర్గంలో ప్రజలకు చేసిన సేవలను ప్రజలు గుర్తు చేస్తున్నప్పుడు చాలా సంతృప్తినిస్తుందని వాళ్లని ఆదర్శంగా తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని గ్రామాల్లో ఇప్పటికే ప్రతి గ్రామంలో పర్యటించానని త్వరలోనే ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

2,826 Views

You may also like

Leave a Comment