
ఇటీవలికాలంలో వరస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ.. ఒక సాలిడ్ హిట్ కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. సబ్జెక్ట్ల పరంగా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ, హిట్ మాత్రం అతని దరి చేరడం లేదు. తాజాగా కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాకపోయినప్పటికీ రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు నటిస్తారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్ ఆ వార్తలను ఖండించింది. అధికారికంగా తాము ఇచ్చే అప్‌డేట్‌లను ఫాలో అవ్వమని సూచించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ సినిమాకి టైటిల్ గురించి వార్తలు వస్తున్నాయి. ఒక సెన్సిబుల్ టైటిల్‌ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేసినట్టు ప్రచారం.
నిన్నుకోరి, మజిలీ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన శివ నిర్వాణ.. ఆ తర్వాత విజరు దేవరకొండ, సమంతలతో ఖుషి ఫ్లాప్ అవ్వడంతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న శివ.. ఒక మంచి హిట్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని డిసైడ్ అయ్యాడు. అందుకే రవితేజతో ఒక డిఫరెంట్ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారని విశ్వసనీయ సమాచారం. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా కనిపిస్తోంది. దానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని యూనిట్ సభ్యులు కోరారట. ఇదే నిజమైతే రవితేజ నుంచి వరసగా వస్తున్న రెండు సినిమాల టైటిల్స్ అతని ఇమేజ్‌కి భిన్నంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎన్నో మాస్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన రవితేజ.. ఇప్పుడు క్లాస్ టచ్‌లో ఉన్న క్యారెక్టర్స్‌తో అందర్నీ అలరించే ప్రయత్నం చేశాడు.
ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం ఉన్నాడు రవితేజ. డిసెంబరు నెలాఖరులోగా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ కాంబినేషన్‌లో సినిమా. రవితేజకు, శివకు ప్రస్తుతం హిట్ ఎంతో అవసరం. దానికి తగ్గట్టుగానే ఇద్దరూ ఎంతో కృషి చేయాలి.