
ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ
కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ క్యాబినెట్
ప్రతిపాడు, Vrm.media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్ 11:–
ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామంలో పాస్టర్ ప్రభాకర్ రావు మందిర ఆవరణం లో మండల పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్–2025 ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి గౌరవ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే సత్య ప్రభను పాస్టర్ ఫెలోషిప్ మండల ప్రెసిడెంట్ సెక్రటరీ ముఖ్యమైన వారు సాధనంగా ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా సత్య ప్రభ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు, సోదరీమణులు మరియు దైవజనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
జీసస్ భక్తుడైన తన భర్త వరపుల రాజా ఆలోచనలు, ఆశయాలు, సేవలను గుర్తుంచుకొని తనని కూడా ఇంత ప్రేమ అభిమానులతో ఆదరిస్తున్నందుకు దైవజన బృందావనం అంతటికీ కృతజ్ఞతలు తెలియజేసారు. తాను కూడా అందరికీ ఉపయోగపడే విధంగా పాస్టర్స్ కమిటీ వారు నా దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో కమిటీ హాల్ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వివరించారు.
క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా జరుపుకునే మహత్తర పండుగ అని అందరూ క్రిస్మస్ ఆనందంగా జరుపుకోవాలని పేర్కొంటూ ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ మాషా జాన్, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ జి. సుందరరావు, సెక్రటరీ పాస్టర్ పులి సాల్మన్, జాయింట్ సెక్రెటరీ పాస్టర్ పి వైస్ మన్, ట్రెజరర్ ఏబిసిడి ప్రసాద్, కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ క్యాబినెట్ బృందం, పాస్టర్ మసా ఇమ్మానుయేల్, పాస్టర్ వల్లూరి రత్నం, పాస్టర్ జాన్ సామ్యూల్, పాస్టర్ డి. రాజబాబు, పాస్టర్ వి. కృపావరం, పాస్టర్ రాజాల షాలెం, మరియు స్టీరింగ్ కమిటీ సభ్యులు వివిధ గ్రామాల పాస్టర్లు గ్రామ పెద్దలు, విశ్వాసులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.