


బస్సు ప్రమాద బాధితులను ఆదుకుంటాం
*ప్రమాద స్థలాన్ని హుటాహుటీనా సందర్శించిన హోం మినిస్టర్ అనిత మరియు ఎమ్మెల్యే శిరీషదేవి, గిరిజన శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
ప్రెస్ నోట్: VRM Midea దుర్గా ప్రసాద్
అన్నవరం నుండి భద్రాచలం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడం చాలా దుర దుష్టకరం అని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మరియు రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చింతూరు మండలం తులసిపాక సమీపంలో రాజుగారి మెట్ట వద్ద శుక్రవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా బస్సు ప్రమాదం,క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడి సత్వర సహాయ చర్యలు వేగవంతం చేయాలన్నారు.మృతదేహాలకు పోస్టుమార్టం వెంటనే నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు త్వరగా అందించాలని సూచించారు. మృతుల కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బాధితులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఇప్పటికే సంఘటన పై ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టినట్లు తెలిపారు. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అందులో 5గురు మహిళలు, 4గురు పురుషులు మొత్తం 9 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్రం గిరిజన శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి , కలెక్టర్ దినేష్ కుమార్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.