
నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ
(యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2025)
ప్రతి ఒక్కరు హక్కులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి – న్యాయవాది బుగత శివ
ప్రత్తిపాడు, Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్ 13:–
ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు మండల లీగల్ కమిటీ ఆధ్వర్యం లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. లీగల్ కమిటీ సభ్యులు బుగత శివ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ హక్కులు, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ ( యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2025 ) సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల కి అందాల్సిన వైద్యం వారు ఎదుర్కొంటున్న సమస్యల కి లీగల ప్రేమ్ లో చట్టపరంగా వారికి అందాల్సిన సౌకర్యాలు హక్కులు వారికి తెలియజేయడం జరుగుతుందని. ప్రతి పదిమంది జనాభాలో నలుగురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని దానితో పాటు వారు ఆర్థికంగా ఆ సమస్యలను ఎదుర్కొనలేక పోవడం వల్ల ప్రభుత్వ పరమైన వైద్యాన్ని ఉపయోగించుకోవాలని దాని కొరకు హాస్పిటల్ సంబంధించిన వారితో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న డెలివరీ సమయంలో డబ్బులు కొరకు ఇబ్బందులకు గురిచేసిన. కారుకులైన వారిపై ప్రతి శనివారం మెజిస్ట్రేట్ వారు ఎటువంటి ఫీజు లేకుండా కేసులు పరిష్కరిస్తారని. చట్టాల పట్ల సరైన అవగాహన ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఫ్రీ మందులు ప్రభుత్వం నిర్దేశించిన వాటిని ఉపయోగించుకోవాలని మాట్లాడారు.
అనంతరం హాస్పిటల్ సూపర్డెంట్ ఎ సౌమ్య మాట్లాడుతూ ఇంతవరకు ప్రత్తిపాడు కమ్యూనిటీ హాస్పిటల్ పై ఉన్న రూమర్లను మళ్లీ పున:రావృతం కాకుండా బాధ్యత వహించి ప్రతి విషయాన్ని గమనించి ఎ ఒక్కరు ఆర్థికంగా డబ్బులు విషయంలో ఇబ్బందులు పడకుండా వైద్యం అందేటట్లు డెలివరీ సమయంలో కూడా ఎ ఒక్కరూ వల్ల డబ్బులు ప్రస్తావన లేకుండా చూస్తానని మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో సూపర్డెంట్ ఏ సౌమ్య తో పాటు డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.