Home ఆంధ్రప్రదేశ్ ఓబిసి రిజర్వేషన్ కొరకు శాసన సభ్యురాలు కు వినతిపత్రం

ఓబిసి రిజర్వేషన్ కొరకు శాసన సభ్యురాలు కు వినతిపత్రం

by VRM Media
0 comments

సానుకూలంగా స్పందించిన పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే సత్య ప్రభ

ప్రతిపాడు, Vrm.media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్ 13:–

ఓ బి సి రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణస్వామి, టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తో టీడీపీ పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు..
పెద్ద శంకర్లపూడి పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ను మర్యాదపూర్వకంగా కలిసారు.
ఏలేశ్వరం పట్టణ తూర్ప కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ పట్టణ తూర్పు సంఘ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రాన్ని అందజేసారు.
తూర్పు కాపు సంక్షేమ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ.
తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్
విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు రాజ్యసభ సతీష్ ద్వారా పరిష్కారం దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఏలేశ్వరం పట్టణలో తూర్పుకాపు సంక్షేమ భవన నిర్మాణానికి చేపట్టే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సామంతుల గోపీ, రెడ్డి నాగేశ్వరరావు,బోడకుడి సత్యనారాయణ,సామంతుల నీలాభరిరావు,కొరాడ రాము, పతివాడ రామకృష్ణ, శంఖాని బాబ్జి, కర్రోతు గాంధీ,కిలారి రామచంద్ర రావు, జొన్నాడ వీరబాబు,సిడగం బాలు,పండ్రకి శ్రీను,మామిడి లలిత,బుగత శ్రీను,తదితర తూర్పు కాపు సభ్యులుపాల్గొన్నారు..

2,819 Views

You may also like

Leave a Comment