Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జడ్పీటీసీ వినతిపత్రం

ఒంటిమిట్ట మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జడ్పీటీసీ వినతిపత్రం

by VRM Media
0 comments

శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల నిర్వహణ పూర్తిగా కడప పై ఆధారపడి ఉంది.

ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 15

ఒంటిమిట్ట:
జిల్లా పునర్విభజనలో ఒంటిమిట్ట మండలాన్ని రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో చేర్చే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ, ఒంటిమిట్ట మండల ప్రజల అభ్యర్థనలను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా జిల్లా పునర్విభజన గెజిట్‌ ప్రకారం ఒంటిమిట్ట మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. చరిత్రాత్మక, సాంస్కృతిక, పరిపాలనా అనుబంధాలు పూర్తిగా కడప జిల్లాతోనే ఉన్నాయని, అందువల్ల ఒంటిమిట్ట మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని కోరారు.
ప్రధాన అభ్యర్థనలు:
ఒంటిమిట్ట మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి.
అది సాధ్యం కాకపోతే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసి ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో ఉంచాలి.
రాయచోటి కేంద్రంగా చేస్తే ఒంటిమిట్టకు తీవ్రమైన అసౌకర్యం ఏర్పడుతుందని, ఒంటిమిట్ట–రాయచోటి దూరం 102 కిలోమీటర్లకు పైగా ఉండటంతో పాటు ప్రత్యక్ష బస్సు సౌకర్యం కూడా లేదని తెలిపారు.
రాజంపేట–ఒంటిమిట్ట దూరం సుమారు 25 కి.మీ మాత్రమేనని, రవాణా సౌకర్యాలు సులభంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర అధికారిక శ్రీరామాలయంగా గుర్తింపు పొందిన ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాల నిర్వహణ పూర్తిగా కడపపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. రాయచోటి వైపు ప్రజలకు ఎలాంటి పరిపాలనా అనుబంధం లేదని, ఈ మార్పును ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఒంటిమిట్ట మండల ప్రజల ఆకాంక్షలను గౌరవించి తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి కోరారు.

2,822 Views

You may also like

Leave a Comment