Home వార్తలు జనవరి 1 నుండి ఢిల్లీలో ‘భారత్ ట్యాక్సీ’ యాప్ – VRM MEDIA

జనవరి 1 నుండి ఢిల్లీలో ‘భారత్ ట్యాక్సీ’ యాప్ – VRM MEDIA

by VRM Media
0 comments
జనవరి 1 నుండి ఢిల్లీలో 'భారత్ ట్యాక్సీ' యాప్


ప్రైవేటు సంస్థలకు పోటీగా కేంద్రం క్యాబ్ హెయిలింగ్ సేవలు

ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం భారత్ ట్యాక్సీ యాప్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఊబర్, ఓలా రాపిడో వంటి ప్రైవేటు సంస్థలు, క్యాబ్ హెయిలింగ్ సేవలకు ప్రత్యామ్నాయంగా ఇది రానుంది. కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా కో-ఆపరేటివ్ క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఢిల్లీ వాసులకు నూతన సంవత్సర కానుకగా జనవరి 1న భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రం ప్రకటన చేసింది. ఆ తర్వాత ఈ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో ఆటో, క్యాబ్, బైక్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీలో ఈ సేవలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాప్ జీరో కమీషన్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. కో-ఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా ఈ సహకార ట్యాక్సీ నిర్వహించబడుతుంది. ఢిల్లీవాసులు జనవరి 1 నుంచి ఆటో, ట్యాక్సీ, బైక్ సేవలను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు వారి మొబైల్ నంబర్‌తో ఎంపిక చేసుకోవచ్చు. ఈ భారత్‌ ట్యాక్సీ యాప్‌ ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇదివరకు ఉన్న క్యాబ్ ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశం ఉంది. సుమారు 56 వేల మంది డ్రైవర్లు భారత్‌ ట్యాక్సీ యాప్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్నట్లు కేంద్రం అందిస్తుంది. ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్‌ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు.

తొలి మిస్ ఇండియా మెహర్ కాస్టలినో కన్నుమూత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,813 Views

You may also like

Leave a Comment