తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం గాదెలపాలెం గ్రామానికి చెందిన కర్రి దుర్గా ప్రసాద్ విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగిపోయి, తీవ్ర గాయాలయ్యాయి.
రాజమండ్రి రాజు న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతనికి తల్లిదండ్రులు ఎవరూ లేరు, కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులకోసం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నారు.
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు బంధువులు, గ్రామస్తులు, వచ్చి సహాయం చేయాలనీ కోరగా, స్పందించిన ఆయన లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
కంబాల శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, రామసేన సభ్యులు బీజేపీ నాయకులు దేశాల నరేష్, దోసపాటి సుబ్బారావు, ధార శ్రీను గురువారం రాత్రి రాజమండ్రి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి, లక్ష రూపాయలు చెక్ ను అందజేశారు