Home Uncategorized సీతారాముల ఆలయ గోపురంపైన సిమెంట్ విగ్రహాల ఏర్పాటుకు 32వేలు విరాళం అందించిన అతికారి క్రిష్ణ

సీతారాముల ఆలయ గోపురంపైన సిమెంట్ విగ్రహాల ఏర్పాటుకు 32వేలు విరాళం అందించిన అతికారి క్రిష్ణ

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 22

సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీలోని యస్.కె.ఆర్ నగర్ హరిజనవాడలో వెలసిన శ్రీ సీతారాముల ఆలయ గోపురంపై సీతారామలక్ష్మణులు, హనుమంతుని సిమెంట్ విగ్రహాలు ఏర్పాటుకు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి క్రిష్ణ ముప్పై రెండు వేల రూపాయలు విరాళంగా తన అనుచరులతో ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామస్థులకు అందచేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, గ్రామస్థులు మాట్లాడుతూ అతికారి క్రిష్ణ గొప్ప మనసున్న వ్యక్తి అని ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునే వ్యక్తిత్వం ఆయనదని ఆలయాలకు, నిరుపేదలకు, నిస్సహాయకులకు సహాయం చేసే దాన గుణం కలిగిన ఏకైక ‌‌నాయకుడని కొనియాడుతూ ఆయనకు ఎప్పటికీ ఋణపడి వుంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై చలపాటి చంద్ర, జనసేన పార్టీ యువ నాయకుడు డేరంగుల శ్రీకాంత్, అవ్వారు రవిశంకర్ నాదెళ్ల చిన్న పుల్లయ్య అయ్యవారయ్య, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

2,817 Views

You may also like

Leave a Comment