తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం కణుపూర్ గ్రామలోని స్మశాన వాటికకు 51,000 రూపాయల వ్యయంతో నూతనంగా బోర్ వేయించి, గ్రామస్తుల ఎన్నో ఏళ్ల నాటి సమస్యను
విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పరిష్కరించారు.
కణుపూరు గ్రామంలో స్మశాన వాటికలో గత 30 ఏళ్ల నుంచి ప్రధానంగా వాటర్ సమస్య ఉంది.
గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటికలో దహనం చేసిన, తరువాత స్నానాలు చేయడానికి, పలు కార్యక్రమాలకు వాటర్ సదుపాయం లేదు.
గ్రామస్తులు ఎన్నో ఏళ్లగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఈ సమస్యలను కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన 51,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని సోమవారం గ్రామస్తులకు అందజేసి, స్మశాన వాటికలో నూతనంగా బోర్ వేయించారు.
దీంతో గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నాటి తమ గ్రామ సమస్య పరిష్కరించిన కంబాల శ్రీనివాసరావు గారికి గ్రామస్తులు, మహిళలు, యువత, కృతజ్ఞతలు తెలిపారు.