Home ఎంటర్‌టెయిన్మెంట్ మీకు, అతనికి ముప్పై ఏళ్ళ వయసు తేడా ఉంది.. అయితే తప్పేంటి – VRM MEDIA

మీకు, అతనికి ముప్పై ఏళ్ళ వయసు తేడా ఉంది.. అయితే తప్పేంటి – VRM MEDIA

by VRM Media
0 comments
మీకు, అతనికి ముప్పై ఏళ్ళ వయసు తేడా ఉంది.. అయితే తప్పేంటి




-అయితే ఏమవుతుంది
-ఆషికా రంగనాధ్ ధీటైన జవాబు
-రవితేజ, చిరంజీవి తో హంగామా

ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆమెని ఆపడం ఎవరి తరం కాదు. ఆపాలనే ప్రయత్నాలు చేసినా, ఆ ప్రయత్నాల్నిఆమెకే పాజిటీవ్ గా మారి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తాయి. సినీ రంగం పుట్టిన దగ్గరనుంచి ఈ సూత్రం వస్తుంది. ఇప్పుడు అలాంటి టైం ‘ఆషికా రంగనాధ్'(Ashika Ranganath)కి రాబోతుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె అప్ కమింగ్ సినిమాల లైనప్ కూడా ఆ విధంగానే ఉంది. మెగాస్టార్ ‘విశ్వంభర'(విశ్వంభర),మాస్ మహారాజ రవితేజ(రవితేజ)భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Vignapthi)ఆషికా ఖాతాలో ఉంది. ఈ రెండిటిలో ముందుగా భర్త మహాశయులకి విజ్ఞప్తి వచ్చే సంక్రాంతికి జనవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆషికా తన వయసులో ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న హీరోల సరసన జత కడుతుందనే చర్చ జరుగుతుంది. కొంత మంది నెటిజెన్స్ అయితే ఏకంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇప్పుడు వాటన్నిటి గురించి రీసెంట్ గా జరిగిన ఒక సినిమాలో ఆషికా మాట్లాడుతు సినిమాకి సంబంధించి నటిగా నా క్యారక్టర్ కి ఎంతవరకు న్యాయం చేస్తున్నాను అనేదే చూస్తాను. అంతేకాని యంగ్ హీరోనా, సీనియర్ హీరోనా అనేది ముఖ్యం కాదు. పెద్ద నటులతో వర్క్ చేయడం నా అదృష్టం. సీనియర్ హీరోలతో పనిచేస్తే కెరీర్‌కి సంబంధించి ఎన్నో కొత్త విషయాలని నేర్చుకోవచ్చు. వారి అనుభవం మనకి ఒక లెసన్ లా పనిచేస్తుంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా, నటనకు స్కోప్ ఉన్న వాటికే ఓటు వేస్తాను. నాగార్జున గారితో నా సామి రంగాల్లో కూడా చేశాను. ఆయన సెట్స్‌లో చూపించే ఎనర్జీ, డెడికేషన్ చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. దీంతో ట్రోల్స్ కి సరైన సమాధానం చెప్పిందంటూ అభిమానుల నుంచి కామెంట్స్ వినబడుతున్నాయి.


ఇది కూడా చదవండి: వాళ్ళ నిజస్వరూపాలు నాకు తెలుసు.. రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు

కన్నడ చిత్ర సీమకి చెందిన ఆషికా 2016లో క్రేజీ బాయ్ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత కన్నడలో దాదాపు పది చిత్రాల వరకు చేసిన ఆషిక 2023 లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ తో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యింది ప్రస్తుతం తమిళంలో కూడా ‘కార్తీ’ తో సర్దార్ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

2,809 Views

You may also like

Leave a Comment