VRM MEDIA ప్రతినిధి అయినవిల్లి భద్రం
టిడిపి నాయకులు, భూపతిపాలెం స్కూల్ చైర్మన్ గళ్ళ రాముని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరామర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలకు గడ్డిని సేకరించే క్రమంలో రాము బైక్ ప్రమాదానికి గురైనారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ గురువారం నాడు రాము స్వగృహం నందు పరామర్శించి యోగ క్షేమములు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూరంపాలెం ప్రాజెక్ట్ చైర్మన్ ఉంగరాల రాము, గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, మండల కన్వీనర్ పిల్ల చంటిబాబు, దాసరి తమ్మనదొర, పాలచర్ల నాగేంద్ర చౌదరి, మంగరౌతు రామకృష్ణ, పాలూరి బోసి బాబు, బద్దిరెడ్డి అచ్చన్న దొర, దాసరి సీతారామకృష్ణ, పోసిన ప్రసాద్, మండిగ గంగాధర్, నాగం వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.
