సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 31
సచివాలయం పరిధిలోని.
ఉప్పరపల్లి లో గల బ్రాహ్మణపల్లి గ్రామం నందు కీటక జనిత వ్యాధుల గురించి డాక్టర్ శివకుమార్ మరియు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు దోమకాటు బారి నుంచి తప్పించుకోవాలని తెలియపరిచారు.
దోమ పుట్టకూడదు పుట్టిన దోమ మానవుల్ని కుట్టకూడదు. ప్రతి ఒక్కరు కూడా దోమతెరలోనే నిద్రపోవాలి పరిసరాల పరిశుభ్రతను పాటించాలి మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలియపరిచారు అలాగనే ప్రతి ఇంటింటికి కూడా లార్వా సర్వే ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది. అలాగేనే ఈ బ్రాహ్మణపల్లి గ్రామం నందు వీధుల నందు కూడా బీసీంగు చల్లడం కూడా జరిగింది కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు మరి మండల సూపర్వైజర్ డి రమణయ్య ఆరోగ్య కార్యకర్త యశోద మరియు యం. యల్. హెచ్. పి శ్రావణి గారు ఆశ కార్యకర్త సారమ్మ గ్రామ ప్రజలందరికి కూడా కీటక జానిత వ్యాధుల గురించి తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా 104 సిబ్బంది డ్రైవర్ రామకృష్ణ డీఈఓ రెడ్డి శేఖర్ కూడా పాల్గొనడం జరిగినది

