సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 31
సిద్దవటం ఒంటిమిట్ట మండలాలతో పాటు రాజంపేటను కడపలో విలీనం చేయడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆద్వర్యంలో మంగళవారం ఉప్పరపల్లె గ్రామంలోని తన నివాసంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జెఏసి నాయకులు, విద్యాసంస్థలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాల, రాజకీయ నాయకుల ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు, పోరాటాల ఫలితంగా ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం కావున ఈరోజు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు. కానీ మండలంలో కొందరు నాయకులు ఒక్కరోజు కూడా దీక్షలు,పోరాటాలు చేస్తున్న వారికి కనీస మద్దతు కూడా తెలపకుండా అంతా తమరే చేసి సాధించినట్లు పాలాభిషేకాలు చేయడం చూస్తుంచే హాస్యాస్పదంగా వుందని. మరికొందరు ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ ఫోటో లేకుండా పాలాభిషేకాలు నిర్వహించడం పట్ల అ
