రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ జనవరి 2
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడిగా ఎన్నికైన సుగవాసి ప్రసాద్ బాబును శుక్రవారం సిద్దవటం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు రాయచోటిలోని తన కార్యాలయంలో కలసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య మాట్లాడుతూ సరైన సమయంలో సమర్ధుడైన యువనేతకు పగ్గాలు ఇవ్వడం మంచి నిర్ణయం అన్నారు. ప్రసాద్ బాబు అధ్యక్షుడిగా రాజంపేట నియోజకవర్గ అధివృద్ధికి ,అలాగే ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న నికార్సైన కార్యకర్తల శ్రేయస్సు కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్ రెడ్డి,ఒంటిమిట్ట మండల సీనియర్ టిడిపి నాయకుడు కిరణ్ కుమార్, నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి కడితం రామ మోహన్ నాయుడు,సిద్దవటం మాజీ సింగల్ విండో అధ్యక్షులు సుధా మురళి ,మాధవరం కూటమి నాయకులు అవ్వారు రవిశంకర్,సుండుపల్లె మైనారిటీ నేత చాంద్ బాషా,టిడిపి నేత వేంకటాద్రి నాయుడు,వార్డ్ సభ్యులు సామల చెంగయ్య,సిద్దవటం టీడీపీ నాయకుడు పుత్తా శివానంద,తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
