*VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం తేది:02-01-2026,శుక్రవారం **
👉కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీషదేవి
రెవెన్యూ సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి అన్నారు. రంపచోడవరం మండలం గోగుమిల్లి గ్రామంలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం శుక్రవారం తహసీల్దార్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పాసు పుస్తకాల్లో లబ్ధిదారులు ఫోటోలు బదులు వేరే ఫోటోలు ఉండేవన్నారు. అసలు హక్కుదారులు ఫోటోలు లేకుండా ఉండేవాని కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెవిన్యూ సేవల్లో ఎలాంటి అలసత్వం లేకుండా పూర్తి పారదర్శకంగా అమలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇప్పటికే చాలా గ్రామాల్లో రీ -సర్వే నిర్వహించడం జరిగిందందని తెలిపారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రీ -సర్వే
చేయించుకున్న లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వ రాజముద్ర తో మంజూరు చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా రంపచోడవరం మండలంలో నేటి నుండి 09-01-2026 వరకు ఆయా గ్రామాల్లో ఈ పాసు పుస్తకాలు అందిస్తారని తెలిపారు. మండల వ్యాప్తంగా గోగుమిల్లి-91, భీమవరం -80, జాగరంపల్లి -95, నల్లగొండ -161, పెద బారంగి -105, పెదపాడు -44 మరియు డోకులపాడు -41 మంది లబ్ధిదారులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరు అయినట్లు తెలిపారు. అనంతరం ఆమె చేతులు మీదుగా లబ్ధిదారులకు కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే సహాయ కలెక్టర్ సాహీద్ మాట్లాడుతూ పాసు పుస్తకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టిలో పెడితే పరిస్కారం చేస్తానన్నారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, AMC వైస్ చైర్మన్ సలాది బాపిరాజు, సర్పంచ్ వెంకట లక్ష్మి, క్లస్టర్ ఇంచార్జి కారం సింహాచలం, పతివాడ రమణ, బూత్ ఇంచార్జి పారా వెంకన్న బాబు, టి బాబురావు, డిప్యూటీ తహసీల్దార్ జిలాని, రెవిన్యూ ఇన్ స్పెక్టర్ నిర్మల కుమారి, తదితరులు పాల్గొన్నారు.


