ఒంటిమిట్ట మండలంలోని కోనరాజుపల్లి హరిజనవాడ సమీపంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే హరిజనవాడలోని బాలిపోగు హరికృష్ణ అనే బాలుడు 2 నెలల నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కలలో కనిపించి నన్ను బయటకి తీయమని తనకు చెబుతున్నాడని హరికృష్ణ తండ్రి కదిరయ్య చెప్పాడు. ఆ కలలో ప్రకారం శనివారం హరిజనవాడకు సమీపంలో హరికృష్ణ చూపిన చోట తవ్వి చూడగా, పురాతన లక్ష్మీనరసింహస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఇది చూడటానికి సమీప గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.