Home Uncategorized టక్కోలు గ్రామ పంచాయతీలో ఘనంగా “స్వచ్ఛ సంక్రాంతి గార్బేజ్ ఫ్రీ గ్రామ సభ”

టక్కోలు గ్రామ పంచాయతీలో ఘనంగా “స్వచ్ఛ సంక్రాంతి గార్బేజ్ ఫ్రీ గ్రామ సభ”

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ జనవరి 5

సిద్ధవటం మండలం టక్కోలు, గ్రామం నందు
స్వచ్ఛ సంక్రాతి సందర్బంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నెత్రుత్వం లో, రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో
గ్రామాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “GARBAGE FREE GRAM PANCHAYATS” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ టక్కోలు గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల సమక్షంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు.
గ్రామ సభలో ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల అభివృద్ధి, శుభ్రత చర్యలపై విస్తృతంగా చర్చించి కీలక తీర్మానాలు చేశారు. చెత్త కేంద్రాల్లో తప్పనిసరిగా విద్యుత్, నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నాడెపు పిట్స్ నిర్మాణం, రంగులు వేయడం, ఫెన్సింగ్ లేదా కంపౌండ్ వాల్ నిర్మాణం వంటి అంశాలకు ఆమోదం తెలిపారు.
అలాగే గ్రీన్ అంబాసిడర్ / షెడ్ మిత్ర నియామకం, వర్మీ కంపోస్ట్ తయారీ, గ్రామ ప్రవేశద్వారాల వద్ద శాశ్వత స్వాగత బోర్డులు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం, చెత్త నిల్వకు ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి గారు,ఎన్. జగన్ మోహన్ రెడ్డి గారు, సర్పంచ్ లక్ష్మీదేవి గారు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధి హామీ సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొని గ్రామ సభను విజయవంతం చేశారు.

2,818 Views

You may also like

Leave a Comment