సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ జనవరి 6
డాక్టర్ గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆంధ్ర సారస్వత పరిషత్తు,ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో గుంటూరులో జరుగుతున్న 2026, 3వ ప్రపంచ తెలుగు మహాసభలో గాయకుడిగా పాల్గొనడానికి సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీ యస్.కె.ఆర్ నగర్ గ్రామానికి చెందిన గూండ్ల సుబ్బరాయుడుకు అవకాశం రావడంతో సోమవారం ఈకార్యక్రమంలో పాల్గొని తన పాటలతో సభను అలరించారు. అనంతరం ప్రముఖులు అమ్మ పండు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, సిల్వర్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా గూండ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ నాకు మూడవ ప్రపంచ మహాసభలో పాడే అవకాశం కల్పించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆయనతో పాటు పాల్గొన్న గాయనీ గాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రముఖుల ప్రోత్సాహం వారి చేతుల మీదుగా అందుకున్న బహుమతులు, వారి స్పూర్తి దాయకమైన మాటలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఇవి దోహద పడతాయని అన్నారు.
