Home Uncategorized కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గర్భిణీలు, రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ

కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గర్భిణీలు, రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం

గోకవరం జనవరి 06: విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేపట్టిన ప్రజా సేవ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ కార్యక్రమం ఒకటి. సుమారుగా రెండేళ్ల నుంచి గోకవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణీలు, అక్కడికి చికిత్స కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి మంగళవారం పండ్లు, పాలు, రొట్టెలను కంబాల శ్రీనివాసరావు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ మంగళవారం కూడా యధావిధిగా రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, సిబ్బంది గర్భిణీలు, రోగులకు పాలు, పండ్లు, రొట్టెలను అందజేశారు. తన సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని, తన వద్దకు కష్టం అని వచ్చిన వారికి, లేదనకుండా సహాయం చేసి తిరిగి పంపిస్తున్నానని, కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కరిబండి వెంకటేశ్వరరావు, మంగరాతి పద్దరాజు, తుమ్మల బుజ్జి, పదిలం చక్రరావు, నిడదవోలు వీరబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

2,816 Views

You may also like

Leave a Comment