Home Uncategorized రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ –

రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ –

by VRM Media
0 comments

ముఖ్యఅతిథిగా హాజరైన జగన్మోహన్ రాజు

మండల తాసిల్దార్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో

VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 8

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని,గత వైకాపా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫోటోతో జారీ చేసిన పాస్ పుస్తకాలపై ప్రజల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తిని కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వాటి స్థానంలో అధికారిక రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తుందని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
గురువారం నాడు ఒంటిమిట్ట మండలం నారాయణరాజుపేట గ్రామం నందు పర్యటిస్తూ మండల తాసిల్దార్ తో కలిసి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా హాజరై చమర్తి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఈ సర్వే పూర్తయిన తర్వాత రాజముద్రలతో కూడిన నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన తెలియజేశారు.
అదేవిధంగా నూతన విధానం ద్వారా భూమి యజమానులకు పూర్తి హక్కులు లభిస్తాయని చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి,మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి,మండల స్థాయి క్లస్టర్ ఇంచార్జ్ తుమ్ముకుంట్ల ఈశ్వరయ్య. టిడిపి మండల యూనిట్ ఇంచార్జ్ కదిరి చంద్రపాల్ మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. టిడిపి సీనియర్ నాయకుడు సలాబాదు బుజ్జి అధికారులు,తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు,రైతులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2,805 Views

You may also like

Leave a Comment