సిద్ధవటం VRM న్యూస్ జనవరి 7
సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని పెద్దపల్లి రెవెన్యూ 937 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములను యంత్రాలతో చదును చేస్తున్న పనులను బుధవారం ఆ గ్రామ ఎస్ కే ఆర్ నగర్ దళితులు అడ్డుకున్నారు. యంత్రాలతో పనులు చేస్తుండగా పనులు జరగనీయకుండా వారు నిలిపేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రిందట ఇక్కడ ఈ భూములపై అసైన్మెంట్ కమిటీ జరగగా తమకు కేటాయించారన్నారు. ఇటీవల ఈ భూములను జాతీయ రహదారుల పనుల పేరుతో చదును చేయగా తాము అడ్డుకొని ఆందోళన చేసామన్నారు. మళ్లీ యంత్రాలు పెట్టి చదును చేసే పనులు చేపట్టడం తగదన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని భూమి చదును పనులను అడ్డుకొని తమకు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. వివాద స్థలం వద్దకు పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దారు ఆకుల తిరుమల బాబును వివరణ కోరగా గ్రావెల్ తవ్వకాలకు ఎవరికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదన్నారు.
