

- ఓటీటీ బిజినెస్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డు
- ఫ్యాన్సీ రేటుకు రైట్స్ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్) అభిమానులు ఎంతగానో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్) సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఈ డీల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ ఓటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆ సినిమా థియేటర్లలో రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టడమే కాకుండా, ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రైట్స్ కోసం అంత మొత్తం చెల్లించడానికి నెట్‌ఫ్లిక్స్ ముందుకొచ్చినట్లుగా వినబడింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఓటీటీ హక్కులు ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడవడం చూస్తే, చిత్రంపై మార్కెట్‌లో ఉన్న క్రేజ్ స్పష్టంగా అర్థమవుతోంది. థియేట్రికల్ కూడా బిజినెస్ భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ చిత్రం ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి: పూరి జగన్నాథ్ తో సినిమాకి ఓకే చెప్పిన స్టార్ హీరో!