తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు
VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 12
ఒంటిమిట్ట :
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి రాయుడు స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని, సంబంధిత కార్యాలయాల్లో ఈ చిత్రపటాలు లేకపోతే ఆ శాఖాధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ప్రజాపాలనకు దిశానిర్దేశం చేసే నాయకుల గౌరవాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిబింబించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వాటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని బొబ్బిలి రాయుడు తెలిపారు.
ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలు క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
