VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం
కోడి పందాలు, గుండాటలు, మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్ఐ షరీఫ్ హెచ్చరిస్తున్నారు.
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో కోడి పందాలు, గుండాటలు, మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దేవీపట్నం ఎస్సై కే షరీఫ్ చెప్పారు.
హైకోర్టు ఉత్తర్వులు
మేరకు ఎవరైనా ఆడిన వాటిని ప్రోత్సహించిన సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి
జూద నిరోధక చట్టం – 1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్.పిలను
హైకోర్టు ఆదేశించిందని, ఈ మేరకు పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్,
ఆదేశాల మేరకు మండలంలో కోడిపందాలు నిర్వహిస్తే
కఠిన చర్యలు తీసుకొని కేసులు పెడతామని దేవీపట్నం ఎస్సై కె షరీఫ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
మండల వ్యాప్తంగా దాడులు నిర్వహిండం జరుగుతుందన్నారు.
ఈ సంక్రాంతి పండగలు మూడు రోజులు మండలంలో ప్రతి ఒక్కరు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు.
ఎవరైనా నిర్వహిస్తే 94409 00763
ఈ నెంబర్ కి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని దేవిపట్నం ఎస్ ఐ కే షరీఫ్ చెబుతున్నారు.
సి సి సి కె ప్రకాశ రావు ✍️
