VRM media ప్రతినిధి అయినవిల్లి భద్రం
“జనసేన ఉద్యమి” సభ్యత్వం ప్రతీ ఒక్కరికీ రక్షణ కవచం లాంటిది”
“ప్రతి ఒక్కరూ సభ్యత్వ సంబరాలు లో పాల్గొని విజయవంతం చేయండి. “
“ఈ ఉద్యమి సభ్యత్వం ప్రతి ఒక్క ఉద్యమి ఉద్యమం లా చేపట్టి మన అధినేత కు బహుమతి గా ఇద్దాం.
జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఆదివారం రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంటరీ నియోజకవర్గ ఉద్యమి సభ్యత్వ నమోదు సమన్వయకర్త రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు.
👉 సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో అధికసంఖ్యలో వేగవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకువెళ్లాలని, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఏదైతే మెంబర్షిప్ టూ లీడర్షిప్ ఆలోచనతో మొదలుపెట్టిన ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి సాధక్ టీమ్ ద్వారా క్షేత్రస్థాయిలో చేరే విధంగా కృషిచేయాలన్నారు. రానున్న రోజుల్లో వచ్చే కమిటీలకు ఈ మెంబర్షిప్ అవసరం అని తెలిపారు. సాధక్ సభ్యులకు స్థానిక నాయకులు అన్ని విధాలుగా సహకరించాలని, అధిక సంఖ్యలో సభ్యత్వాలు జిల్లాలో నమోదు అవ్వాలని కోరారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4 రెట్లు అధికంగా సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో మనమందరం నడవాలని సూచించారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో సభ్యత్వం తీసుకున్నటువంటి సాధక్ లు నాయకులను ఎన్నుకోవడంలో కీలక పాత్ర వహిస్తారని కాబట్టి ప్రతీ ఒక్కరికీ ఈ మెంబర్షిప్ ముఖ్యమని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

