Home ఎంటర్‌టెయిన్మెంట్ విజయ్‌, పూరి బ్లైండ్‌గా వస్తున్నారు.. టైటిల్‌ కూడా డిఫరంటే! – VRM MEDIA

విజయ్‌, పూరి బ్లైండ్‌గా వస్తున్నారు.. టైటిల్‌ కూడా డిఫరంటే! – VRM MEDIA

by VRM Media
0 comments
విజయ్‌, పూరి బ్లైండ్‌గా వస్తున్నారు.. టైటిల్‌ కూడా డిఫరంటే!



డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్‌ది ఒక విభిన్నమైన శైలి. అలాగే నటుడిగా విజయ్‌ సేతుపతిది ఒక డిఫరెంట్‌ స్టైల్‌. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌ మనం చూశాం. ఇప్పుడు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు.

ఒక బెగర్ స్టోరీ ప్రధానంగా ఈ సినిమాలో ఉంటుందని పూరి జగన్నాథ్ చెప్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో బ్లైండ్‌ బెగ్గర్‌గా విజయ్‌ సేతుపతి పూర్తి స్థాయి నటనను ప్రదర్శించే అవకాశం ఉంది. నటనలో విజయ్‌, డైరెక్షన్‌లో పూరి ఏ స్థాయిలో రెచ్చిపోతారో మనకు తెలుస్తుంది. ఈ సినిమాకి ‘స్లమ్‌డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్‌’ చిత్రానికి సంబంధించి విజయ్‌సేతపతి లుక్‌ను విడుదల చేశారు. ఇంతకుముందు విజయ్‌ చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

ఈ సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా టబు, దునియా విజరు సినిమాలో మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పూరీ సూపర్‌ కంబ్యాక్‌లా ప్రారంభమైంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పూరీ మళ్లీ ఫాం లోకి వస్తే చూడాలని సినీ లవర్స్ కోరుతున్నారు. విజయ్ సేతుపతితో పూరీ చేస్తున్న ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి.

2,812 Views

You may also like

Leave a Comment