Home Uncategorized ఖమ్మంలో టిబిజెఏ కమిటీ సమావేశం

ఖమ్మంలో టిబిజెఏ కమిటీ సమావేశం

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి ఖమ్మం

ఖమ్మం, జనవరి 21 :

టిడబ్ల్యూజేఎఫ్ అనుసంధానంతో తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిబిజెఏ) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం జిల్లా పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టిబిజెఏ ఖమ్మం జిల్లా నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, పట్టణ అధ్యక్షులు ఎలుగోటి వెంకట్ లు కలిసి, జిల్లా కోశాధికారిగా కే. శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షులుగా ఎన్. రాకేష్, షేక్ సోందుమియా, సహాయ కార్యదర్శిగా సి.హెచ్. రాంబాబులను ఏకగ్రీవంగా నియమించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి ఆర్వపల్లి నగేష్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వీడియో జర్నలిస్టుల జిల్లా అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, సహాయ కార్యదర్శి కుంభం రవికుమార్, టీబీజేఏ నగర అధ్యక్షులు వెంకట్, షేక్ మీరా, అలీమ్, రామచందర్, షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు.

2,807 Views

You may also like

Leave a Comment