రోడ్డు నిర్మించండి…. లేదా ఆత్మ త్యాగాని కైనా సిద్ధం…… ఆదివాసి గిరిజన సంఘం నాయకులు లోతా రామారావు
ఏలేశ్వరం , Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ జనవర23:–
ప్రత్తిపాడు నియోజక వర్గం, ఏలేశ్వరం మండలం లో, రమణయ్యపేట గ్రామం నుండి జె అన్నవరం వరకు ఉన్న 11 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా పాడైపోయి , పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. ఈ రోడ్డు పై ప్రయాణించాలంటే నరకానికి అధికారికంగా పాస్పోర్ట్ తీసుకున్నట్టే. గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉన్న ఈ రోడ్డు ను నిర్మించాలంటూ, అనేక మంది పార్టీ నాయకులు కానీ, ప్రజాసంఘాల వారు గాని, చేయని ధర్నా లేదు తెలుపని నిరసన లేదు. ఈ వరవడిలో ఇప్పటికే ధర్నా చేసి నిరసన తెలియజేసిన ఆదివాసి గిరిజన సంఘం నాయకులు లోత రామారావు మరల మరోసారి రోడ్డు కోసం మహా ధర్నా అంటూ, నిరసన దీక్ష కొరకు ఇటీవల పిలుపు నివ్వడం జరిగింది. అన్నమాట ప్రకారం ఈరోజు రమణయ్యపేట నుండి జె అన్నవరం వరకు గల రోడ్డు నిర్మాణం కొరకు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలన మారుతుంది కానీ, ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న గిరిజనుల పరిస్థితి మాత్రం మారటం లేదని,గిరిజనుల ప్రాణాలు అంటే, ప్రభుత్వానికి లెక్క లేదా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రోడ్డుపై హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చి ప్రయాణిస్తున్న గర్భిణులు, ఈ గుంతల మయమైన రోడ్డు వల్ల దారిలోనే అబార్షన్ పాలు అవుతున్నారని, ఆయన వాపోయారు. రోడ్ అయినా నిర్మించండి లేదా ఆత్మ త్యాగానికి కైనా సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. రాజవొమ్మంగి జడ్పిటిసి ఈ జ్యోతి మాట్లాడుతూ, నాలుగు గిరిజన మండలాలకు ముఖ ద్వారమైన ఏలేశ్వరం నుండి ప్రత్తిపాడు మరియు రంపచోడవరం నియోజకవర్గాలను కలిపే రహదారి పాడైపోయి గిరిజనులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిపి రహదారి విషయంలో ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు, అధికారంలో లేనప్పుడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ఈ రహదారిపై గోడను నిర్మించడం మరోసారి గుర్తు చేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన నాయకులు మాట్లాడుతూ, రోడ్డు పురం పునర్నిర్మాణం వెంటనే ప్రారంబించకపోతే ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని అన్నారు. కాదా ఈ ధర్నా కార్యక్రమం వల్ల బస్సులు ఆటోలు తిరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు.ఈ కార్యక్రమంలో, రాజవొమ్మంగి జడ్పీటీసీ వి. జ్యోతి, జడ్డంగి సర్పంచ్ మురళి, ఆదివాసీ గిరిజన సంఘ నాయకుడు లోతా రామారావు,చికిలింత సర్పంచ్ కొండల సూరి బాబు, కొండపల్లి సర్పంచ్ కుంజం జగన్నాథం, గడు ఓ కుర్తి సర్పంచ్ చంద్రుడు, గిరిజన సంఘం జిల్లా నేత జిల్లా నేత మట్ల వాణిశ్రీ, నాలుగు మండలాల గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.
