Home Uncategorized స్వర్గీయ అతిగారి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

స్వర్గీయ అతిగారి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

by VRM Media
0 comments


మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన సీనియర్ నాయకుడు Y. కిరణ్ స్వామి

VRM న్యూస్ జిల్లా ఇన్చార్జి రవిబాబు జనవరి 27

రాజంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, స్వర్గీయ అతిగారి వెంకటయ్య మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రాలేకపోయినందుకు తాను ఎంతగానో చింతిస్తున్నానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు స్వయంగా సిద్ధవటం గ్రామానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అతిగారి కృష్ణ, అతిగారి దినేష్‌లతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ స్వర్గీయ అతిగారి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి రానున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ప్రత్యేకంగా ఒంటిమిట్ట మండలం నుంచి జనసేన పార్టీ నాయకులు నిత్యానంద రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, ఎనమదాల కిరణ్ కుమార్, కత్తి ఐశ్వరయ్య, దొడ్డి నారాయణ వర కుమార్, నరసింహ, దున్నుతల రఘునాథ రెడ్డి, వినోద్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “రాజంపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ అతిగారి వెంకటయ్యకు మంచి పేరు, గౌరవం ఉంది. ఆయన మరణం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన లేని లోటును తీర్చడం ఎవరి తరం కాదు” అని అన్నారు. అలాగే స్వర్గీయ అతిగారి వెంకటయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
అతిగారి వెంకటయ్య సేవలను ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం జనసేన శ్రేణుల్లో విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.

2,815 Views

You may also like

Leave a Comment