VRM MEDIA ప్రతినిధి బోనకల్


బోనకల్/ఖమ్మం : సీనియర్ జర్నలిస్ట్, బోనకల్ మండలం చొప్పకట్ల పాలెం గ్రామ ఉప సర్పంచ్ పల్లా కొండల్ రావు గారిని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ప్రతినిధులు పరామర్శించారు. ఇటీవల (ది. 27.01.2026) కొండల్ రావు గారి నాన్న గారైన పల్లా రామ కోటయ్య (93) గారు గుండె పోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న యూనియన్ ప్రతినిధులు, కొండల్ రావు గారిని వారి స్వగ్రామమైన బోనకల్ మండలంలోని చొప్పకట్ల పాలెం వెళ్ళి పరామర్శించారు. రామ కోటయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని వేడుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన మరణానికి దారి తీసిన కారణాలను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
కమఠం సత్యవతి గారికి నివాళి
అనంతరం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ప్రతినిధులు ఖమ్మం నగరంలోని సీనియర్ ఫోటో గ్రాఫర్ కమఠం శ్రీనివాస రావు గారి అమ్మ గారు కమఠం సత్యవతి గారి పెద్ద కర్మకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి గారి చిత్ర పటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కో కన్వీనర్లు యెన్నెబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా, అమరనేని రామకృష్ణ(సుమన్ టీవీ), ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు కట్టెకోల చిన నరసయ్య, జాబిశెట్టి కుటుంబ రావు, బొడ్డు పల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.