Home ఎంటర్‌టెయిన్మెంట్ అల్లు అర్జున్‌ను కలవాలంటే ప్రోటోకాల్.. హాట్ టాపిక్‌గా రామోజీ ఫిల్మ్ సిటీ ఘటన! – VRM MEDIA

అల్లు అర్జున్‌ను కలవాలంటే ప్రోటోకాల్.. హాట్ టాపిక్‌గా రామోజీ ఫిల్మ్ సిటీ ఘటన! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


  • అల్లు అర్జున్‌ను కలవాలంటే ప్రోటోకాల్స్ ఉంటాయా?
  • ’42 రూల్స్’ నిజమేనా?
  • బన్నీ మేనేజర్ శరత్ చంద్ర షాకింగ్ రియాక్షన్!
  • ఆర్‌ఎఫ్‌సిలో ఈటీవీ విన్ సాయికి ఎదురైన అనుభవం?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్)ను కలవాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆయన మేనేజర్ శరత్ చంద్ర స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు.

కొద్దిరోజుల క్రితం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరువా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు తనకి’42 రూల్స్’తో కూడిన ఒక లిస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. “సార్ కళ్ళలోకి నేరుగా చూడకూడదు”, “షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు”, “ఆయన అడిగితే తప్ప మాట్లాడకూడదు” వంటి వింత రూల్స్ జాబితాలో ఉన్నాయని ఆమె చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అల్లు అర్జున్ పై నెగెటివ్ ట్రోలింగ్ జరిగింది. దీంతో బన్నీ టీం.. ఆ ఆరోపణలను ఖండించడమే కాకుండా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

అయితే ముదరడంతో బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరువా.. తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, అల్లు అర్జున్ కి బహిరంగ క్షమాపణలు చెప్పారు.

ఇదే విషయంపై తాజాగా బన్నీ మేనేజర్ శరత్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మాతగా పరిచయమవుతున్న ‘గుర్తుకొస్తున్నాయి’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో.. అల్లు అర్జున్ ని కలవాలంటే “42 రూల్స్ ప్రోటోకాల్” ఉంటుందనే వార్త నిజమేనా? అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.

ఈ ఆరోపణలను శరత్ చంద్ర తీవ్రంగా ఖండించారు. అసలు వాస్తవం లేదని నిరూపించారు. ఈ విషయం నేను చెప్పడం కాదు.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గుర్తుకొస్తున్నాయి’ షూటింగ్ సమయంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణకు ఎదురైన అనుభవాన్ని ఆయన పంచుకుంటారంటూ మైక్ అందించారు.

“రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్ గారు ఒక యాడ్ షూట్ లో ఉన్నారు. నేను అనుకోకుండా శరత్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. బన్నీ గారు చాలా ఆప్యాయంగా పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చారు.” అని ఈటీవీ విన్ సాయి చెప్పుకొచ్చారు.

శరత్ చంద్ర, సాయి ఇచ్చిన క్లారిటీతో “అల్లు అర్జున్ 42 రూల్స్” ట్రోల్స్ కి ఇకనైనా బ్రేక్ పడుతుందేమో చూడాలి.

2,801 Views

You may also like

Leave a Comment