Home Uncategorized రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు-పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు-పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి

హైదరాబాద్, జనవరి 29:
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నాగోల్ రాక్ టౌన్ కాలనీలోని పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా నాయకుడు సామ్రాట్ గుప్తా కుమారుడు తర్షిత్ తేజ ను ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తర్షిత్ తేజ ఆరోగ్య పరిస్థితిని, రోడ్డు ప్రమాదం జరిగిన తీరును సామ్రాట్ ను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న హర్షిత్ తేజ తన బంధువులతో కారులో వెళుతుండగా లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తర్షిత్ తేజ కుడికాలు, కుడి చేయి విరిగాయి. పవన్ సాయి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో రేపు సర్జరీ చేయనున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య సామ్రాట్ కు అతని భార్యకు ధైర్యం చెప్పి మందుల ఖర్చుల కోసం ఐదు వేలు సహాయం చేశారు.

2,817 Views

You may also like

Leave a Comment