VRM న్యూస్, బాల మౌలాలి, ఒంటిమిట్ట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన తిరుమల సంకల్ప పాదయాత్ర బుధవారం సాయంత్రం ఒంటిమిట్టకు చేరుకుంది. పాదయాత్ర ఒంటిమిట్టకు చేరుకుందన్న విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట మండల టిడిపి నాయకులు జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి, టిడిపి మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, బొడ్డే వెంకటరమణ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సంఘీభావం తెలిపారు. అనంతరం బండ్ల గణేష్ విలేకరులతో మాట్లాడుతూ… నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే కోరికను తీర్చిన ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఈ పాదయాత్ర మొదలు పెట్టానన్నారు. రాబోయే ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణానికి తప్పక వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గజ్జల శ్రీనివాసులురెడ్డి, కట్ట సుబ్బరాయుడు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

