Home ఎంటర్‌టెయిన్మెంట్ చిరంజీవి, సురేఖ ఫన్నీ మూమెంట్.. అసలు నేను వంట చేస్తేనే కదా! – VRM MEDIA

చిరంజీవి, సురేఖ ఫన్నీ మూమెంట్.. అసలు నేను వంట చేస్తేనే కదా! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఒక సరదా సన్నివేశం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి (చిరంజీవి) సతీమణి సురేఖ తన వంటల టాలెంట్ గురించి, చిరు దోసెల గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా నిలిచాయి. (గద్దర్ అవార్డులు)

గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ ను ప్రముఖ యాంకర్స్ సుమ, ప్రదీప్ హోస్ట్ చేశారు. వేడుకకు హాజరైన సినీ ప్రముఖులను సరదాగా పలకరిస్తూ.. సురేఖ దగ్గరకు వెళ్ళి, ఉగాది కదా ఈరోజు ఇంట్లో పులిహోర చేశారా అని అడిగారు. దానికి సురేఖ చేశామని సమాధానమిచ్చారు.

ఆ తర్వాత “మీరు చేసే వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైన వంట ఏది?” అని సుమ అడగగా.. “అసలు నేను చేస్తేనే కదా” అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు సురేఖ.

“అయితే చిరంజీవి గారు దోసెలు వేసే వీడియోలు నిజమేనా?” సుమ అనడంతో.. “దోసెలు వేయడం ఆయనే నేర్పించారమ్మా” అని సురేఖ చెప్పారు.

సురేఖ అలా చెబుతున్న సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ భలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, గద్దర్ అవార్డ్స్ లో ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ఈ ఏడాది చిరంజీవి అందుకోవడం విశేషం.

2,801 Views

You may also like

Leave a Comment