-రోడ్డు నిర్మాణం సరే… నాణ్యత మాటేంటి..?
ప్రత్తిపాడు, Vrm media న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్
ఫిబ్రవరి7:–
ప్రత్తిపాడు నుంచి కిల్లంపూడి వెళ్లే ప్రధాన రహదారిని ఇటీవలే నూతనంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే నిర్మాణం పూర్తయి నెల రోజులు కూడా గడవకముందే రోడ్డు పగిలిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనంతో వేసిన రహదారి ఈ స్థాయిలో దెబ్బతినడం నాణ్యతా ప్రమాణాలపై పెద్ద ప్రశ్నగా మారింది. రోడ్డుపై పగుళ్లు రావడంతో తాత్కాలికంగా మరమ్మత్తులు చేసినప్పటికీ, ఇది సమస్యకు శాశ్వత పరిష్కారమా? లేక లోపభూయిష్ట నిర్మాణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్లు & భవనాల శాఖ నిధులతో నిర్మిస్తున్న ఈ రహదారి ఎంతకాలం మన్నుతుందో అన్న సందేహం ఇప్పుడు సామాన్యుల నోట వినిపిస్తోంది. నాణ్యతా తనిఖీలు సక్రమంగా జరిగాయా? కాంట్రాక్టర్ పనితీరుపై పర్యవేక్షణ ఉందా? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానాలు లేవు. ప్రజల ప్రయాణ భద్రత, ప్రభుత్వ నిధుల వినియోగం రెండింటికీ ఈ రహదారి కీలకం. అలాంటప్పుడు నిర్మాణంలో నిర్లక్ష్యం జరిగితే బాధ్యత ఎవరిది? అన్నది తేలాల్సిందే. సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నించగా భారీ వాహనాలు తిరగడం ఒక్కసారిగా బ్రేక్ లు వేయడంతో ఈ సమస్య తలెత్తిందని వీటిని కాంట్రాక్టర్ తో మాట్లాడి సరి చేయిస్తామని తెలిపారు.
