Home Uncategorized రంప యర్రంపాలెంలో దేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల*

రంప యర్రంపాలెంలో దేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల*

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం

వార్షికోత్సవానికి 50 వేలు రూపాయలు, అన్నసమారాధనకు 20 బస్తాలు బియ్యం విరాళం

  • తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట పేట నియోజకవర్గం, గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామం,గంగభవాని నగర్ లోని శ్రీశ్రీశ్రీ దేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
  • తొలిత కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం ఆధ్వర్యంలో యువత బైక్ ర్యాలీలతో, బాణాసంచ కాల్పులు, తీన్మార్ డప్పులతో, పూల వర్షం కురిపిస్తూ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
  • అలయంలో అమ్మవారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. మహిళలు చేపట్టిన బోనాలు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
  • వార్షికోత్సవ కార్యక్రమానికి 50 వేలు రూపాయలు, అన్న సమారాధన కార్యక్రమానికి 20 బస్తాలు బియ్యం విరాళం అందజేశారు.
  • ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ని శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి, మెమొంటో అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు బత్తుల నానాజీ, నాగ రమేష్, వీరాంజలి, పెద్దాడ వెంకన్న దొర, రాయపాటి సత్యనారాయణ, దేశాల నరేష్, తుమ్మల బుజ్జి, దోసపాటి సుబ్బారావు, మండే గౌతమ్, గంట రాధాకృష్ణ, కళ్లా బుజ్జి, మళ్లా సుభద్ర, కాళ్ళ సత్యవతి, పోతుల కుమారి, కాళ్ళ శివ, ప్రసాద్, ఫలిక కుమార్, దసింపూడి వెంకటేశ్వరరావు, శెట్టి శ్రీను, ఫలంశెట్టి నాని, నామాల వీరబాబు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు…
2,817 Views

You may also like

Leave a Comment