- VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం
పాటంశెట్టి సూర్యచంద్ర
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
పేదలందరికీ ఉచితంగా ఇళ్ళులు నిర్మిస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలతో ఉాదరగొట్టి గెలిచి గద్దినెక్కాక 16 సంవత్సరాల క్రితం పట్టాలు పొందిన వారిని తరిమేస్తామంటే చూస్తూ ఊరుకోమని పేదల పక్షాన బాధితులకు అండగా ఉంటామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. జగ్గంపేటలో 2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీ తోట నరసింహం ఆధ్వర్యంలో 196/2 సర్వే నెంబర్లో 170 మంది నిరుపేదలకు 4 ఎకరాల 73 సెంట్లు భూమి ప్రభుత్వం కేటాయించిందని నాటి నుండి నేటి వరకు హౌసింగ్ కాలనీ నిబంధనల ప్రకారం త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ మొదలగు కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల గృహాలు నిర్మించుకోలేకపోయామని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఎంతో ప్రయత్నం చేశామని నాడు కూడా మా సమస్యలు పరిష్కరించలేదని గత ఎన్నికల్లో కూడా శ్రీ జ్యోతుల నెహ్రూ నవీన్ ఓట్లేసి గెలిపించండి మీ సమస్య పరిష్కరిస్తాము డ్రైవర్స్ కాలనీలో అన్ని వసతులు ఏర్పాటు చేసి మీకు పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారని నేడు ఈ స్థలాలతో మాకు సంబంధం లేదని ఇక్కడ మమ్మల్ని ఖాళీ చేయాలని వేరే వారికి ఇస్తున్నామని మేము చేసుకుంటున్న గృహ నిర్మాణ పనులను రెవెన్యూ పోలీస్ అధికారులచే నిలుపుదల చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు అందరూ తమ ఆవేదనను పాటంశెట్టి సూర్యచంద్రకు వివరించి న్యాయం చేయాలని కోరారు. బాధితులందరికీ తప్పకుండా అండగా ఉండి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని సూర్యచంద్ర బాధితులందరికీ ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మిస్తామని మాయమాటలు చెప్పి నేడు గత 16 సంవత్సరముల క్రితం ఇచ్చిన పట్టాలు రద్దుచేసి పేదల నోట్లో మట్టి కొట్టడం న్యాయం కాదని శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కి జ్యోతుల నవీన్ కి మీడియా ద్వారా సూర్యచంద్ర తెలిపారు. తమ అనాలోచిత నిర్ణయాలు మార్చుకోకపోతే బాధితుల పక్షాన వారికి అండగా న్యాయం జరిగే వరకు పోరాడుతామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు.
