VRM ప్రతినిధి అయినవిల్లి భద్రం
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం రాజానగరం శాసనసభ్యులు కార్యాలయం లో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆదేశాలు.
రాజానగరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. గురువారం రాజానగరం మండల కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే బలరామకృష్ణ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీల, పుంత రోడ్లు నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో నివేదికలు తయారుచేసి వేగంగా అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు కొత్తగా చేపట్టవలసిన రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి ప్రతిపాదనలను, వాటికి అవసరమయ్యే నిధుల వివరాలను అందించాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ పనులు వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు కొత్తగా రోడ్లు , డ్రైనేజీల నిర్మాణానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గం లోని ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా వాటర్ ట్యాంక్లు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించినప్పుడే సుపరిపాలన అందించడం జరుగుతుందన్నారు.
