

-అనేక రికార్డ్స్ ప్రేమాభిషేకం సొంతం
=ఆ వీడియోలో ఏముంది
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
నటసామ్రాట్, ఎవర్ గ్రీన్ ‘ఏఎన్ఆర్'(ANR)సృష్టించిన సినీ కలెక్షన్స్ ల సునామిలో ‘ప్రేమాభిషేకం'(ప్రేమాభిషేకం)కి ఉన్న స్థానం వెలకట్టలేనిది. ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ అనే రీతిలో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకుల నిద్రలో లేపి ప్రేమాభిషేకం గొప్పతనం చెప్పమని అడిగామనుకోండి. ఆనందం, ఉద్వేగంతో తమ కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీటి పొరని దాచుకుంటూ చెప్తారు. అంతలా ప్రేమాభిషేకం వాళ్ళ హృదయాల్లో అమరత్వాన్ని నింపుకొని ఉంది. దర్శక రత్న దాసరి నారాయణరావు మనోఫలం, కలం యొక్క దృక్పధం నుంచి వచ్చిన ప్రేమాభిషేకం తెలుగు చిత్ర పరిశ్రమ బతికి ఉన్నంత కాలం కూడా తన అజమాయిషీ చెలాయిస్తూనే ఉంటుంది. ఈ రోజుతో ప్రేమాభిషేకం సిల్వర్ స్క్రీన్ పై నలభై ఐదు సంవత్సరాలు.
ఈ సందర్భంగా ప్రేమాభిషేకం నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ ఒక స్పెషల్ వీడియో షేర్ చేసింది. ‘ప్రేమతో మొదలైన ప్రయాణం’ అనే వ్యాఖ్యతో ప్రారంభమైన వీడియోలో రాజేష్(ఏఎన్ఆర్), దేవి(శ్రీదేవి), జయంతి(జయసుధ) క్యారెక్టర్ల మధ్య కథకి సంబంధించిన ముఖ్యమైన సీన్స్, డైలాగ్స్ ని ఉంచింది. ఇప్పుడు ఈ వీడియో అక్కినేని అభిమానులని విశేషంగా అలరిస్తుంది. కథ పరంగా చూసుకుంటే రాజేష్, దేవి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న టైంలో రాజేష్ కాన్సర్ బారిన పడతాడు. ఈ విషయం దేవికి తెలిస్తే పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంటారని రాజేష్ భావిస్తున్నాడు. దీనితో ఒక వేశ్య చెంతకి చేరి జులాయి గా దేవి కి తనపై ద్వేషం కలిగేలా చేసి,ఆమె మరో పెళ్లి చేసుకునేలా చేసి చివరకి మరణిస్తాడు. రాజేష్ గా ఏఎన్ ఆర్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా తన ఒడిలో ఉన్న నటుల్ని పరిచయం చేసేటప్పుడు ఏఎన్ ఆర్ ని తన ప్రతిభింబంగా చూపిస్తూనే ఉంటుంది.
కూడా చదవండి: అగ్ర హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తండ్రి మృతి.. లేట్ గా తెలియడానికి గల కారణం ఏంటి!
రికార్డుల పరంగా చూస్తే ఇరవై ఐదు సెంటర్స్ లో వంద రోజులు, పదహారు సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ ,హైదరాబాద్ సుదర్శన్ థియేటర్స్ లో ఐదువందల ముప్పై మూడు రోజులు, విజయవాడ, గుంటూరు, తెనాలి లాంటి ఏరియాల్లో 365 రోజులు, మరో ఎనిమిది సెంటర్స్ లో షిఫ్ట్స్ తో కలుపుకొని వన్ ఇయర్ నడిచింది. బెంగుళూరులో సెవెంటీ ఫైవ్ వీక్స్ ఆడిన సంచలన రికార్డు ప్రేమాభిషేకం సొంతం. ఏఎన్ ఆర్ అభిమానులు డైలీ ఈ రికార్డ్స్ లిస్ట్ చేసుకొని మురిసిపోతుంటారు. ఫిబ్రవరి 16 ,1981 విడుదల తేదీ. సాంగ్స్ నేటికీ మారుమోగిపోతుండటం ప్రేమాభిషేకం కి ఉన్న మరో భారీ ప్రత్యేకత.