

-ఎందుకు ధురంధర్ 2 పై ద్వేషం
-ఎవరు అలా చేస్తారు
-ఆదిత్య ధర్ వార్నింగ్ ఇచ్చే దాకా పరిస్థితి వచ్చిందా!
ఇప్పుడు ఏ ఇద్దరు,ముగ్గురు కలిసినా ధురంధర్ 2(ధురంధర్ 2)చూసావా లేదా అని ఒకరినొకరు అడిగే పరిస్థితి. చూడలేదంటే ఎక్కడ నామూషీగా ఉంటుందేమో అని వీలు చూసుకొని మరుసటి రోజు ఖచ్చితంగా చూస్తున్నారు. అందుకే కలెక్షన్స్ ధురంధర్ పాదాక్రాంతం అవుతున్నాయి. ఇందుకు సాక్ష్యం ఫస్ట్ వీక్ కే సాధించిన 1000 కోట్ల రూపాయల గ్రాస్. ఈ విధంగా కనివిని ఎరుగని రికార్డులని సృష్టించే దిశగా ధురంధర్ ఉంటే కొంత మంది ధురంధర్ 2 ని బాడ్ చేసే పనిలో దాదాపు ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఆదిత్య ధర్(Aditya Dhar)తనదైన స్టయిల్‌లో వార్నింగ్ ఇస్తున్నాడు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉరఫ్ ఐఐని ఉపయోగించి కొంత మంది రణవీర్ సింగ్ క్యారక్టర్ హంజా తలకి సిక్కులాగా తలపాగా ధరించి సిగరెట్ తాగుతూనే ఉంచి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంత మంది సిక్కు సోదరులు హర్ట్ అవుతు కామెంట్స్ చేస్తున్నారు. విషయాన్నీ గమనించిన ఆదిత్య దర్ ఎక్స్ వేదికగా హంజా తలపాగా ధరించిన పిక్ అబద్ధం. ఏఐ తో ఎవరో కావాలని క్రియేట్ చేసారు.అలజడులు సృష్టించాలనేది వాళ్ళ ప్లాన్. సిక్కుల పట్ల నాకెంతో గౌరవం ఉంది. వారిపై గౌరవంతోనే మూవీలో క్యారెక్టర్స్ ని డిజైన్ చేశాను. మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకున్నానని తన పోస్ట్ లో తెలిపాడు.
ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి: జరుగుతుందా! అదే జరిగితే సినీ అదృష్టం పట్టినట్లే
ఆదిత్య ధర్ చెప్పినట్టుగానే సిక్కులపై గౌరవంతోనే సినిమా ప్రారంభంలో హంజా ఒరిజినల్ క్యారక్టర్ జస్కి రాత్ సింగ్ తుపాకీ చేతబూని కొంతమందిని అత్యంత జుగుప్సాకరంగా చంపుతాడు ఆ సమయంలో జస్కి రాత్ చేత సిక్కు అనే సింబాలిక్ గా తలపాగా ధరింపచేయలేదు.